P Narayana: రింగ్ రోడ్డు కేసులో మంత్రి నారాయణకు నోటీసులపై విచారణ రేపటికి వాయిదా
- ఈ పిటిషన్‌ను బుధవారం విచారిస్తామని తెలిపిన ఏపీ హైకోర్టు
- ఇదే కేసులో సీఐడీ నుంచి నోటీసులు అందుకున్న నారాయణ అల్లుడు పునీత్
- తనకు వచ్చిన నోటీసులను సస్పెండ్ చేయాలని కోర్టుకు వెళ్లిన పునీత్
- ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విచారించాలని హైకోర్టు ఆదేశాలు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ జారీ చేసిన నోటీసులపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. సీఐడీ విచారణపై తన ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ కోరారు. అయితే దీనిపై రేపు విచారిస్తామని కోర్టు తెలిపింది.
ఇదిలా ఉండగా, ఐఆర్ఆర్ కేసులోనే సీఐడీ నోటీసులు అందుకున్న నారాయణ అల్లుడు పునీత్‌కు హైకోర్టులో పూర్తిగా ఊరట లభించలేదు. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సీఐడీ పునీత్‌కు నోటీసులు జారీ చేసింది. తనకు సీఐడీ ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే పునీత్‌ను ఉదయం గం.10 నుంచి మధ్యాహ్నం గం.1 వరకు, న్యాయవాది సమక్షంలో విచారించాలని హైకోర్టు ఆదేశించింది.