Supreme Court: అబార్షన్ పై సొంత తీర్పునే పక్కన పెట్టిన సుప్రీంకోర్టు
- మహిళ గర్భస్రావానికి అనుమతించిన సుప్రీంకోర్టు
- మెడికల్ బోర్డు సూచనలకు విరుద్ధమన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్
- దీంతో ఆదేశాల అమలు నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
సుప్రీంకోర్టు ఒక మహిళ గర్భస్రావంపై (అబార్షన్) కీలక ఆదేశాలు జారీ చేసింది. 26 వారాల గర్భాన్ని (ఏడు నెలలు) తొలగించేందుకు ఎయిమ్స్ కు ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజే, తన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. వైద్య పరమైన గర్బస్రావాన్ని వాయిదా వేయాలని ఎయిమ్స్ ను ఆదేశించింది. గర్భస్థ శిశువు (పిండం) జీవించేందుకు అవకాశాలు ఉండడంతో సుప్రీంకోర్టు తన ఆదేశాలను సమీక్షించింది.