Stock Market: ఆద్యంతం లాభాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు
- 394 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 122 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా పెరిగిన విప్రో షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 66,473కి చేరుకుంది. నిఫ్టీ 122 పాయింట్లు లాభపడి 19,811కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (3.29%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.09%), రిలయన్స్ (1.58%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.57%), నెస్లే ఇండియా (1.15%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.24%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.56%), టీసీఎస్ (-0.52%), టాటా స్టీల్ (-0.24%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.14%).