Narendra Modi: ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యటన.. పార్వతీ కుండ్ శివాలయంలో పూజలు
- నేడు రాష్ట్రంలోని పితోర్ఘడ్ జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాని
- జిల్లాలోని పార్వతీకుండ్ ఆలయంలో పరమశివుడి దర్శనం చేసుకున్న మోదీ
- స్థానిక సంప్రదాయ దుస్తుల్లో పూజాదికాలు నిర్వహించిన వైనం
- తదుపరి, జిల్లాలో రూ.4200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
గురువారం ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ పితోర్ఘడ్ జిల్లాలోని పార్వతీ కుండ్ వద్ద పరమశివుడి దేవాలయాన్ని సందర్శించారు. స్థానిక సంప్రదాయ దుస్తుల్లో మోదీ అక్కడ పూజాదికాలు నిర్వహించారు. ఢమరుకం, శంఖానాదాలతో పరమేశ్వరుడిని అర్చించారు.
ఆ తరువాత ప్రధాని మోదీ పరమశివుడు కొలువైన ఆది కైలాశ్ పర్వతాన్ని కూడా సందర్శించనున్నారు. అక్కడి జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామాన్ని కూడా సందర్శిస్తున్నారు.
కాగా, నేటి పర్యటనలో మోదీ జిల్లాలో రూ.4200 కోట్ల విలువైన పలు అభివృద్ధికార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ పర్యటనతో కుమోన్ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యటన ఊపందుకుంటుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.