Ketham Reddy: నారాయణకు టీడీపీ టికెట్ నేపథ్యంలో.. నెల్లూరు సిటీ కీలకనేత కేతంరెడ్డి జనసేనకు రాజీనామా
- గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి జనసేన తరపున పోటీ చేసిన కేతంరెడ్డి
- పార్టీలో అవమానాలకు గురవుతున్నానని ఆవేదన
- కేతంరెడ్డి వైసీపీలో చేరనున్నట్టు సమాచారం
జనసేన పార్టీకి నెల్లూరు సిటీ కీలక నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదని తన రాజీనామా లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓటమిపాలయ్యారు. ఓటమి తర్వాత కూడా తాను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నానని, పవన్ కల్యాణ్ సీఎం అయితే, ఆయన పక్కన తాను ఉంటే ప్రజలకు మరింత ఎక్కువ సేవ చేసే అవకాశం వస్తుందని తాను భావించానని చెప్పారు. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అనే నినాదంతో 316 రోజుల పాటు తన నియోజకవర్గంలో ఒక్క ఇంటిని కూడా వదలకుండా 'పవనన్న ప్రజాబాట' కార్యక్రమాన్ని చేపట్టానని తెలిపారు. పార్టీలో తనకు పదవులు ఇవ్వకపోయినా, పార్టీ కార్యక్రమాలకు పిలవకపోయినా, తనకు అవమానాలు ఎదురవుతున్నా భరించానని చెప్పారు.