World Cup: వరల్డ్ కప్: టాస్ గెలిచిన ఆసీస్... డికాక్ బాదుడు
- వరల్డ్ కప్ లో నేడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ
- లక్నోలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
- 26 ఒవర్లలో 1 వికెట్ కు 143 పరుగులు చేసిన సఫారీలు
- సెంచరీ దిశగా డికాక్
వరల్డ్ కప్ లో నేడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే, తమ కెప్టెన్ నిర్ణయానికి ఆసీస్ బౌలర్లు తగిన న్యాయం చేయలేకపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సఫారీలు దూకుడుగా ఆడుతుండడమే అందుకు కారణం.
ప్రస్తుతం 26 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 1 వికెట్ నష్టానికి 143 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడడంతో స్కోరు బోర్డు పరుగులు తీస్తోంది. డికాక్ 84 బంతుల్లోనే 89 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.. అతడి స్కోరులో 8 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ టెంబా బవుమా 35 పరుగులు చేసి మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం డికాక్ కు తోడుగా వాన్ డర్ డుస్సెన్ క్రీజులో ఉన్నాడు.
స్టార్క్, హేజెల్ వుడ్, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపాలతో కూడిన ఆసీస్ రెగ్యులర్ బౌలింగ్ విభాగం సఫారీ లైనప్ పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. పార్ట్ టైమ్ బౌలర్ మ్యాక్స్ వెల్ కు ఒక వికెట్ దక్కింది.