Budda Venkanna: జగన్ కాళ్లు ఎక్కువగా నాకితే ఇంతే! ఉండవల్లి అరుణ‌కుమార్‌పై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శ

Budda venkanna lashes out at undavalli arun kumar for his comments over chandrababu
  • చంద్రబాబుకు తెలీకుండా స్కాం జరిగిందా? అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శ
  • ఉండవల్లి కామెంట్స్‌పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న గుస్సా
  • చంద్రబాబుకు ఒక్క రూపాయి అయినా చేరినట్టు నిరూపించే దమ్ముందా? అంటూ సవాల్
  • కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలీకుండా స్కిల్ స్కాం జరిగిందా? అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన విమర్శలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కాళ్లు ఎక్కువగా నాకడం వలన అందరూ అవినీతి పరుల్లా కనిపించడం సహజమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి మేల్ మెనోపాజ్ దశకు చేరుకున్నారని ఎద్దేవా చేవారు. కనీస అవగాహన లేకుండా ఉండవల్లి మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఆయన మెదడు అరికాల్లోకి జారిందా? అన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. మేధావిలా బిల్డప్ ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఒక్క రూపాయి అయినా చేరినట్టు కేసు పెట్టిన వాళ్లు లేదా ఉండవల్లి గానీ నిరూపించే దమ్ముందా? అంటూ ‘ఎక్స్’ వేదికగా సవాల్ విసిరారు.
Budda Venkanna
Undavalli Arun Kumar
Telugudesam
YSRCP

More Telugu News