Chiranjeevi: మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న శంకర్ దాదా ఎంబీబీఎస్

Chiranjeevis ShankarDada MBBS Re Releasing On Nov 4th
  • వరల్డ్ వైడ్ గా నవంబర్ 4న రీరిలీజ్
  • చిరు కామెడీ టైమింగ్ తో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ
  • హిందీ మున్నాభాయ్ ఎంబీబీఎస్ కు రీమేక్ గా నిర్మాణం
మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను రీరిలీజ్ చేస్తారంటూ గత ఆగస్టు నుంచి ప్రచారం జరుగుతుండగా.. తాజాగా రీరిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 4న శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నట్లు బీఏ రాజు టీమ్ అధికారికంగా ప్రకటించింది.

హిందీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ గా వచ్చిన సినిమాను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ గా తెరకెక్కించగా.. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో చూపించిన కామెడీ టైమింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. బాస్ కు ముఖ్య అనుచరుడిగా, ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ సరిగ్గా ఒదిగిపోయారు. దీంతో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా మరోమారు థియేటర్లలో సందడి చేయనుంది.
Chiranjeevi
ShankarDada
Re Release
Entertainment

More Telugu News