Joe Biden: గాజాను ఆక్రమించొద్దు.. ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్

Biden warns Israel not to occupy Gaza Says Biden

  • గాజాను మళ్లీ ఆక్రమించుకుంటే అది పెద్ద తప్పే అవుతుందన్న బైడెన్
  • గాజాలోని పాలస్తీనా ప్రజలందరికీ హమాస్ ప్రాతినిధ్యం వహించబోదన్న అమెరికా అధ్యక్షుడు
  • ఇజ్రాయెల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా వెళ్లబోదని ఆశాభావం

గాజాపై భూతల దాడికి సిద్దమవుతున్న వేళ ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. గాజాను ఆక్రమించుకోవద్దంటూ ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల కారణంగా 29 మంది అమెరికన్లు సహా 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘సీబీఎస్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. గాజా స్ట్రిప్‌ను పూర్తిస్థాయిలో ఆక్రమించుకోవడాన్ని తాము సమర్థించబోమన్నారు.  

‘‘అది చాలా పెద్ద తప్పే అవుతుంది’’ అని  బైడెన్ చెప్పుకొచ్చారు. గాజాలో ఏం జరుగుతోందో తన కోణంలో చెప్పాలంటే.. అక్కడి పాలస్తీనా ప్రజలందరికీ హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రాతినిధ్యం వహించబోదని తేల్చి చెప్పారు. కాబట్టి గాజాను కనుక ఇజ్రాయెల్ మళ్లీ ఆక్రమించుకుంటే అదిపెద్ద తప్పే అవుతుందని చెప్పారు. అయితే, అక్కడున్న ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందేనని బైడెన్ వివరించారు. ఇజ్రాయెల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లదన్న విశ్వాసం తనకు ఉందని బైడెన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News