Israel-Hamas War: ముగిసిన డెడ్‌లైన్.. గాజా నుంచి తరలిపోయిన 10 లక్షల మంది.. భూతల దాడికి ఇజ్రాయెల్ రెడీ

Deadline Over 1 Million Flee from Gaza

  • గాజాను విడిచిపెట్టాలంటూ డెడ్‌లైన్ విధించిన ఇజ్రాయెల్
  • గాజా సరిహద్దులో 4 లక్షల మందిని మోహరించిన ఇజ్రాయెల్
  • గాజా ఉత్తర ప్రాంతానికి నీరు, విద్యుత్తు, ఆహార సరఫరాను నిలిపివేసిన ఇజ్రాయెల్

గాజాను విడిచిపెట్టాలంటూ ఇజ్రాయెల్ ఇచ్చిన వార్నింగ్ డెడ్‌లైన్ ముగిసింది. ఇప్పటి వరకు పది లక్షలమందికిపైగా పాలస్తీనీయులు గాజాను విడిచిపెట్టారు. గాజాపై దండెత్తేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్ ఇప్పటికే సరిహద్దులో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్), ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్స్ (ఐఏఎఫ్) సహా 4 లక్షల మంది రిజర్వులను మోహరించింది. 

గాజాపై భూతలదాడికి సిద్ధమైన ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన గాజా ఉత్తర ప్రాంతానికి నీళ్లు, విద్యుత్తు సరఫరా నిలిపివేసింది. ఆహారం అందకుండా చేసింది. గాజా దక్షిణ ప్రాంతానికి మాత్రం నిన్న నీటి సరఫరాను పునరుద్ధరించింది. ఇజ్రాయెల్‌పై దాడులకు సూత్రధారిగా భావిస్తున్న హమాస్ కమాండర్ యహ్యా సిన్వార్‌ను ‘డెడ్ మ్యాన్ వాకింగ్’ (నడుస్తున్న చనిపోయిన వ్యక్తి)గా ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ రిచర్డ్ హెచ్ట్ అభివర్ణించారు.

  • Loading...

More Telugu News