sbi: యూపీఐ సేవల్లో సమస్యలు... ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్

SBI Customers Face Technical Issue While Using UPI Transactions For Last 2 Days
  • టెక్నాలజీ అప్ గ్రేడేషన్ జరుగుతోందన్న ఎస్బీఐ
  • యూపీఐ సేవలలో ఇబ్బందులు ఎదురుకావొచ్చునని వెల్లడి
  • రెండు రోజులుగా యూపీఐ ట్రాన్సాక్షన్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కస్టమర్లు
ఎస్బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది. యూపీఐ సేవల్లో ఎస్బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురు కావొచ్చునని తెలిపింది. ఎస్బీఐ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ చేపట్టింది. దీంతో ఎస్బీఐ కస్టమర్లకు యూపీఐ సేవల్లో అంతరాయం కలిగే అవకాశముంటుందని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించింది.

గత రెండు రోజులుగా ఎస్బీఐ యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో కస్టమర్లు సమస్య ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా సమస్య వస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదని, వారు ఈ సమస్యను ఆనందిస్తున్నట్లుగా ఉన్నారంటూ ఓ నెటిజన్ ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
sbi
upi

More Telugu News