Gaza Hospital: గాజా ఆసుపత్రి ఘటన.. హమాస్ పనేనన్న ఇజ్రాయెల్

Israel And Hamas Trade Blame After 500 Killed At Gaza Hospital

  • హమాస్ రాకెట్ మిస్ ఫైర్ అయుంటుందని వెల్లడి
  • ఆసుపత్రుల చుట్టుపక్కల తాము దాడి చేయట్లేదని వివరణ
  • ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని హమాస్ ఆరోపణ

సెంట్రల్ గాజాలోని ఆసుపత్రిలో మంగళవారం జరిగిన పేలుడు ధాటికి 500 మందికి పైగా చనిపోయారు. ఆసుపత్రులపై దాడులు జరగవనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో జనం చేరడంతో ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉందని సమాచారం. అయితే, ఈ ఘటనపై ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని హమాస్ ఆరోపిస్తుండగా.. హమాస్ మిలిటెంట్లు పేల్చిన రాకెట్ మిస్ ఫైర్ అయి ఆసుపత్రిపై పడి ఉంటుందని ఇజ్రాయెల్ విమర్శిస్తోంది.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ.. ఆసుపత్రులపై తమ బలగాలు దాడులు చేయలేదని తేల్చిచెప్పారు. సెంట్రల్ గాజాపై ఎలాంటి ఏరియల్ దాడులు చేపట్టలేదని వివరించారు. గాజా ఆసుపత్రి ఘటనకు కారణమైన రాకెట్ తమది కాదని స్పష్టం చేశారు. హమాస్ మిలిటెంట్లు పేల్చిన రాకెట్ పొరపాటున ఆసుపత్రిపై పడి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ స్టేట్ మెంట్ విడుదల చేశారు. ఆసుపత్రిపై దాడి ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం తనను బాధిస్తోందని అందులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News