central govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపును ప్రకటించిన కేంద్రం
- 4 శాతం డీఏ పెంపునకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం
- 42 శాతం నుంచి 46 శాాతానికి చేరిక
- నవంబర్ నెల వేతనాలతో పాటు చెల్లింపులు
ముఖ్యమైన పండుగల ముందు ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు డీర్ నెస్ అలవెన్స్ (కరవు భత్యం/డీఏ)ను 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకు డీర్ నెస్ రిలీఫ్ (డీఆర్) ను 4 శాతం పెంచింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.