Siddharth Luthra: ఆదిరెడ్డి అప్పారావు బెయిల్ ను సమర్థించిన సుప్రీంకోర్టు
- జగత్ జనని చిట్ ఫండ్ కేసులో టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు అరెస్ట్
- అప్పారావుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ
- అప్పారావు తరపున వాదనలు వినిపించిన లూథ్రా
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అప్పారావుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సమర్థిస్తున్నామని చెప్పింది. జగత్ జనని చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరికీ ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసింది.
సీఐడీ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. సీఐడీ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా... ఆదిరెడ్డి అప్పారావు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. లూథ్రా వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు... హైకోర్టు బెయిల్ ను సమర్థించింది. చంద్రబాబు కేసులను కూడా లూథ్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే.