harsha kumar: చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా బెయిల్ ఇవ్వాలి: మాజీ ఎంపీ హర్షకుమార్
- చంద్రబాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శ
- చంద్రబాబుపై నేరారోపణ జరిగిందని, నేరం రుజువు కాలేదని వెల్లడి
- ఎలాంటి నేరారోపణ నిర్ధారణ కాకపోయినా నలబై రోజులుగా జైల్లో ఉంటున్నారన్న హర్ష కుమార్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయనపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేతపై నేరారోపణ మాత్రమే జరిగిందని, ఆయన నేరం చేసినట్లు ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ఆయన నేరం చేసినట్లు ఎలాంటి నిర్ధారణ జరగకపోయినా నలభై రోజులుగా జైల్లో ఉంటున్నారన్నారు.
ఆయన ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేయాలని కాంక్షించారు. చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారని, ఈ జైలు వ్యవహారాలను సాధారణంగా అధికారులు పర్యవేక్షించాలని, కానీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేత సజ్జల పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు.