Dabur India: డాబర్ ఉత్పత్తులతో కేన్సర్..? యూఎస్, కెనడా కోర్టుల్లో కేసులు
- డాబర్ హెయిర్ స్ట్రయిటనర్, రిలాక్సర్ పై ఆరోపణలు
- వీటితో ఒవేరియన్, యుటెరస్ కేన్సర్ వస్తుందన్న ఆందోళన
- మూడు డాబర్ సబ్సిడరీలపై నమోదైన కేసులు
ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్ వివాదాల్లో చిక్కుకుంది. డాబర్ కేశ సౌందర్య ఉత్పత్తులు కేన్సర్ కు కారణమవుతున్నాయంటూ అమెరికా, కెనడా న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. డాబర్ కంపెనీకి చెందిన మూడు అనుబంధ సంస్థలు నమస్తే లేబరేటరీస్ ఎల్ఎల్ సీ, డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్ ఐఎన్ సీ, డాబర్ ఇంటర్నేషనల్ పై కేసులు నమోదైనట్టు డాబర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.