same sex marriage: ఆసియాలో ఈ ఒక్క దేశంలోనే స్వలింగ వివాహాలకు చట్టబద్ధత
- 2019లో స్వలింగ వివాహాలకు ఆమోదం తెలిపిన తైవాన్
- ఈ తరహా చట్టం కలిగిన ఏకైక ఆసియా దేశంగా గుర్తింపు
- ప్రపంచంలో ఈ తరహా చట్టాన్ని తొలిగా తెచ్చింది నెదర్లాండ్స్
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు భారత సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. అసలు ఇలాంటి చట్టం ఎక్కడైనా ఉందా..? అన్న ఆశ్చర్యం కలగకపోదు. ఆసియాలోనే ఒక దేశంలో స్వలింగ జాతీయుల మధ్య వివాహానికి చట్టబద్ధత కలిపించారు. ఆ దేశం తైవాన్. 2019లో స్వలింగ వివాహాలను చట్టప్రకారం గుర్తిస్తున్నట్టు ప్రకటించడం ద్వారా ప్రపంచం దృష్టిని తైవాన్ ఆకర్షించింది. స్వలింగ వివాహాలు ఒక్క తైవాన్ కే పరిమితం అనుకోకండి. ఆఫ్రికా సహా ఎన్నో దేశాల్లో ఈ ఆచారం నడుస్తోంది.