Arab world: పాలస్తీనాపై మారిన భారత్ వైఖరి.. గల్ఫ్ లో మన వాళ్లకు కష్టాలు తెస్తుందా?
- ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించిన భారత్
- హమాస్ మిలిటెంట్ల దాడికి తీవ్ర ఖండన
- మొదట్నుంచీ ప్రత్యేక పాలస్తీనా అన్నది భారత్ విధానం
- మారిన వైఖరితో గల్ఫ్ లో భారతీయులకు ఇబ్బందికరంగా మారుతుందన్న భావన
ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ నెల 7న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయెల్ పై రాకెట్లు, క్షిపణులు, సముద్ర, భూతల మార్గం ద్వారా దాడులకు దిగడం తెలిసిందే. సుమారు 500 మంది ఇజ్రాయెల్ వాసులను తొలిరోజే అంతమొందించారు. 5,000 రాకెట్లను హమాస్ మిలిటెంట్లు ప్రయోగించారు. దీంతో భారత ప్రధాని ఇజ్రాయెల్ కు సంఘీభావం తెలిపారు. నెతన్యాహు ప్రధాని మోదీకి కాల్ చేసిన సందర్భంగా ఇది చోటు చేసుకుంది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్ కూడా చేశారు.