Samantha: దీని అర్థం... సమంత ఆరోగ్యం మెరుగుపడుతోందనేనా?

Is Samantha health condition improving
  • మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత
  • అమెరికాలో చికిత్స తీసుకుంటున్న సామ్
  • తనకు ఇష్టమైన బ్రెడ్, బటర్, జామ్ మళ్లీ తీసుకుంటున్న సమంత
దక్షిణాది టాప్ సినీ హీరోయిన్లలో ఒకరైన సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా ఆమె సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది. కొత్త సినిమాలను ఒప్పుకోలేదు. ఇదే సమయంలో ఇతర సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్సులను కూడా వెనక్కి ఇచ్చేసింది. ప్రస్తుతం తన వ్యాధికి సమంత అమెరికాలో చికిత్స తీసుకుంటోంది. 

సమంత ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వస్తున్నాయి. ఇటీవల కొంత కోలుకున్న సమంత అనారోగ్యం మళ్లీ తిరగబెట్టిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు త్వరగా కోలుకోవడం కోసం సమంత తాను తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకుందట. డాక్టర్ల సలహా మేరకు తనకు ఇష్టమైన కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉంటోందట. బంగాళాదుంప, నట్స్, గుడ్లు, పాలు వంటి పదార్థాలను తీసుకోవడం లేదట. తనకు ఇష్టమైన బ్రెడ్, బటర్, జామ్ లను కూడా సమంత దూరంగా పెట్టింది. అయితే ఇప్పుడు వాటిని మళ్లీ తీసుకుంటోందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్స్టా ద్వారా వెల్లడించింది. దీంతో, సమంత కోలుకుంటున్నట్టే ఉందని ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్యం చేస్తున్నారు.
Samantha
Tollywood
Health

More Telugu News