Canada: భారత్‌తో దౌత్యవేత్తల వివాదం.. కెనడాకు మద్దతుగా అమెరికా
- భారత్ ఆదేశాలతో తన దౌత్యవేత్తలను వెనక్కు పిలిపించుకున్న కెనడా ప్రభుత్వం
- ఈ ఘటనపై కెనడాకు మద్దతుగా నిలిచిన అమెరికా
- దౌత్యవేత్తల ఉపసంహరణకు పట్టుపట్టొద్దంటూ భారత్‌కు సూచన
భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిన వేళ అగ్రరాజ్యం అమెరికా కెనడాకు మద్దతుగా నిలిచింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య తగ్గించాలంటూ ఒత్తిడి చేయొద్దని భారత్‌ను కోరింది. గురువారం భారత్‌లోని తన 41 మంది దౌత్యవేత్తలను కెనడా వెనక్కు పిలిపించుకున్న విషయం తెలిసిందే. దౌత్యవేత్తల సంఖ్య తగ్గించుకోవాలంటూ భారత్ విధించిన డెడ్‌లైన్ ముగియడంతో వారిని వెనక్కు రప్పించింది.
ఈ పరిణామంపై అమెరికా తాజాగా స్పందించింది. ‘‘దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలన్న భారత్ డిమాండ్ మేరకు కెనడా దౌత్యవేత్తల తరలింపు మాకు ఆందోళన కలిగిస్తోంది’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.
సిక్కు వేర్పాటువాది, కెనడా పౌరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైన విషయం తెలిసిందే.