Gaganyaan: గగన్ యాన్ ప్రయోగంలో తలెత్తిన సమస్య ఇదే: ఇస్రో ఛైర్మన్
- గగన్ యాన్ మిషన్ ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో
- తొలి ప్రయత్నంలో గ్రౌండ్ కంప్యూటర్ లో తలెత్తిన సమస్య
- వెంటనే దాన్ని సరిచేసి మిషన్ ను సక్సెస్ చేసిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశధనా సంస్థ ఈరోజు చేపట్టిన గగన్ యాన్ ప్రయోగంలో తొలుత టెక్నిల్ సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో, ప్రయోగాన్ని ఇస్రో కాసేపు వాయిదా వేసింది. ఆ తర్వాత సమస్యను వెంటనే పరిష్కరించి ప్రయోగాన్ని విజయవంతం చేసింది. మరోవైపు ఏ టెక్నికల్ సమస్యలు తలెత్తాయో ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు.
లాంచింగ్ సమయంలో గ్రౌండ్ కంప్యూటర్ లో ఇబ్బంది తలెత్తిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత దాన్ని వెంటనే సరిచేసి మిషన్ ను సక్సెస్ చేశామని చెప్పారు. శబ్ద వేగం కంటే కొంచెం వేగంగా వెహికల్ ప్రయాణించిందని తెలిపారు. క్రూ మాడ్యూల్ ని ఎస్కేప్ సిస్టమ్ విజయవంతంగా వేరు చేసిందని... సముద్రంలో టచ్ డౌన్ ఆపరేషన్ విజయవంతమయిందని చెప్పారు. క్రూ మాడ్యూల్ ని రికవరీ చేసి... డేటాను పరిశీలిస్తామని... ఆ తర్వాత ఈ మిషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.