mahua moitra: డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు... మహువా మోయిత్రాపై ఆరోపణల మీద తృణమూల్ మౌనం
- పార్లమెంటులో మోదీకి, అదానీకి వ్యతిరేకంగా మహువా ప్రశ్నలు
- దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు వచ్చినట్లు బీజేపీ ఎంపీ ఆరోపణలు
- ఈ వ్యవహారం పట్టనట్లుగా తృణమూల్ కాంగ్రెస్
తమ పార్టీ ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ మౌనం వహిస్తోంది. డబ్బులు తీసుకొని లోక్ సభలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్రమోదీకి, వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడేందుకు మహువా మోయిత్రా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తృణమూల్ మౌనం వహించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిదని ఆ పార్టీ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే స్పందిస్తే బాగుంటుందని ఆ పార్టీ భావిస్తోందట. పార్టీ అధినాయకత్వం ఈ వ్యవహారంలో తలదూర్చేందుకు ఇష్టపడటం లేదంటున్నారు. అయితే తమ పార్టీ నేతలపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా తృణమూల్ ఇలాగే వ్యవహరిస్తోందని అంటున్నారు.