Anand Mahindra: ఈ-బైక్‌ను పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా.. ఈజీగా మడతెట్టేయచ్చని వ్యాఖ్య

first foldable diamond frame e bike with full size wheels in the world says Anand Mahindra

  • హార్న్‌బ్యాక్ ఎక్స్ 1 ఈ-బైక్‌ను పరిచయం చేసిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా
  • ప్రపంచంలో ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్‌ ఉన్న తొలి ఈ-బైక్ ఇదేనని వెల్లడి
  • ఐఐటీ బాంబే వారు దీన్ని తయారు చేశారన్న మహీంద్రా
  • వారి స్టార్టప్ సంస్థలో తాను పెట్టుబడి పెట్టానని వెల్లడి

తన జాతీయతను సగర్వంగా ప్రదర్శించే పారిశ్రామికవేత్తల్లో మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందుంటారు. భారత్ గొప్పదనాన్ని, విజయాలను చాటే ఏ అవకాశాన్ని వదులుకోరు. ఇక సాటి భారతీయుల విజయాలను కూడా ప్రపంచానికి పరిచయం చేసేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. 

తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ ఈ-బైక్ గురించి చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఐఐటీ బాంబేకు చెందిన వారు దీన్ని రూపొందించారంటూ వెల్లడించిన ఆయన, ఈ-బైక్ ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రపంచంలో ఇలాంటి ఈ-బైక్ మరొకటి లేదని కూడా చెప్పుకొచ్చారు. సైకిల్ విశేషాలు ఆయన మాటల్లో.. 

‘‘ఐఐటీ బాంబే వారు మరోసారి మనందరం గర్వపడేలా చేశారు. ప్రపంచంలోనే ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్ ఉన్న తొలి ఈ-బైక్‌ను రూపొందించారు. ఫుల్ సైజు చక్రాలు దీని సొంతం. దీంతో, మిగతా ఈ-బైక్స్ కంటే దీనికి 35 శాతం మేర అదనపు సామర్థ్యం ఉంది. అంతేకాకుండా, మీడియం వేగం వద్ద మరింత స్థిరంగా ఉంటుంది. ఈ ఈ-బైక్‌ను మడతపెట్టే సమయంలో పైకి ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. దీనిపేరు హార్న్‌బ్యాక్‌ ఎక్స్ 1. ఇటీవలే దీనిపై మా కార్యాలయం కాంపౌండ్ చుట్టూ ఓ రౌండ్ కొట్టొచ్చా. ఈ అంకుర సంస్థలో పెట్టుబడి కూడా పెట్టా. ప్రస్తుతం ఈ ఈ-బైక్ అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది ’’ అని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News