Israel-Hamas War: పాలస్తీనాకు భారత్ భారీ మానవతా సాయం.. టన్నుల కొద్దీ సామగ్రితో బయలుదేరిన విమానం
- ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పాలస్తీనా ఉక్కిరిబిక్కిరి
- 6.5 టన్నుల వైద్య సాయం, 32 టన్నుల విపత్తుసాయంతో బయలుదేరిన విమానం
- ఈజిప్టులోని ఎల్-అరిష్ విమానాశ్రయంలో ల్యాండ్ కానున్న విమానం
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాలస్తీనాకు భారత ప్రభుత్వం మానవతా సాయాన్ని పంపింది. దాదాపు 6.5 టన్నుల వైద్య సాయం, 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రితో భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం పాలస్తీనా బయలుదేరింది. ఇది ఈజిప్టులోని ఎల్-అరిష్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి వాటిని పాలస్తీనాకు తరలిస్తారు.
విమానం మోసుకెళ్లిన సామగ్రిలో ప్రాణాలు నిలబెట్టే ఔషధాలు, శస్త్రచికిత్సకు అవసరమయ్యే వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, టార్పాలిన్లు, శానిటరీ వస్తువులు, నీటి శుద్ధి మాత్రలు వంటివి ఉన్నట్టు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.