Nara Lokesh: సైకో జ‌గ‌న్ అనావృష్టికి అన్న‌య్య‌... చూపు ప‌డితే ప‌చ్చ‌ని పంట పొలాలు ఎండిపోతాయి: నారా లోకేశ్

Nara Lokesh criticises CM Jagan over drought

  • సీఎం జగన్ పై నారా లోకేశ్ విమర్శలు
  • దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ జగన్ అంటూ వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో కరవు తాండవిస్తోందని వెల్లడి
  • జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. సైకో జ‌గ‌న్ అనావృష్టికి అన్న‌య్య‌ అని పేర్కొన్నారు. చూపు ప‌డితే ప‌చ్చ‌ని పంట పొలాలు ఎండిపోతాయి... అడుగుపెడితే నిండుగా ఉన్న డ్యాముల గేట్లు కొట్టుకుపోయి ఖాళీ అయిపోతాయని వ్యంగ్యం ప్రదర్శించారు. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే క‌రవుకి బ్రాండ్ అంబాసిడ‌ర్, ద‌రిద్రానికి కేరాఫ్ అడ్ర‌స్  సైకో జ‌గ‌న్ అని అభివర్ణించారు. 

"వందేళ్ల చ‌రిత్ర‌లో అతి త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదై రాష్ట్రంలో క‌రవు విల‌య‌తాండ‌వం చేస్తోంది. జ‌గ‌న్ మ‌హాప్ర‌భో... సాగునీరో...  అని రైతులు గ‌గ్గోలు పెడుతుంటే, తాడేప‌ల్లి కొంప‌లో నీరో చ‌క్ర‌వ‌ర్తిలాగా ఇసుక‌-లిక్క‌ర్ లెక్క‌లు వేసుకుంటూ, రాజ‌కీయ క‌క్ష‌ సాధింపుల్లో మునిగితేలుతున్నాడు. 

ఒక్క చాన్స్ ఇచ్చిన ఖ‌ర్మానికి వ‌రి వేసిన రైతుకి ఉరి, పంట‌లు వేసిన అన్న‌దాత‌ల‌కి మిగిలింది గుండె మంట‌లు. కృష్ణా ప‌శ్చిమ డెల్టాలో ఎండిన పంట చూసి ఆందోళ‌న‌తో చేలోనే ఉరి వేసుకుంటామంటోన్న రైతుల గోడు విన‌ప‌డ‌దా! క‌ర్నూలు జిల్లా ఉరుకుంద వ‌ద్ద‌ సాగునీటి కోసం అధికారుల కాళ్ల‌పై ప‌డిన రైతులు ఆందోళ‌న ప‌ట్ట‌దా! శ్రీకాకుళం జిల్లా గార మండ‌లంలో వ‌ర్షాభావ ప‌రిస్థితులు, తెగుళ్ల‌తో ఎండిన వ‌రి పంట‌కి నిప్పు పెట్టిన రైతన్న‌ల ఆగ్ర‌హ జ్వాల‌లు క‌న‌ప‌డ‌వా! తాడేపల్లి నీరో చ‌క్ర‌వ‌ర్తికి" అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News