Deepika Padukone: ఈ ఒక్క హీరోతోనే నా వ్యక్తిగత విషయాలను కూడా చర్చిస్తా: దీపికా పదుకొణే
- నలుగురిలోకి వెళ్తే ముడుచుకుపోతానన్న దీపిక
- సినిమా విషయాలను తన భర్తతోనే పంచుకుంటానని వెల్లడి
- షారుక్ తో వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడతానన్న దీపిక
బాలీవుడ్ లో దీపికా పదుకొణే వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఆమె సినిమాలో ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. ఆమె కాల్షీట్ల కోసం దర్శకులు, నిర్మాతలు ఎన్ని రోజులైనా వేచి చూస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను జన్మతః క్రీడాకారిణిని అని... అందుకే ఓటమిని కూడా ఒక క్రీడాకారిణిలా హుందాగా స్వీకరిస్తానని చెప్పారు. తనకంటే గొప్పగా నటించే వాళ్లు చాలా మంది ఉండొచ్చని... కానీ, క్రమశిక్షణలో తన తర్వాతే ఎవరైనా అని అన్నారు.