G. Kishan Reddy: నారా లోకేశ్-అమిత్ షా భేటీలో తన పాత్రపై కిషన్ రెడ్డి క్లారిటీ

Kishan Reddy on nara lokesh and amit shah meeting

  • వీరిద్దరి భేటీలో తన పాత్ర ఏమీ లేదన్న కిషన్ రెడ్డి
  • అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం లోకేశ్ పలుమార్లు ప్రయత్నించారని వెల్లడి
  • తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక కేంద్రమంత్రిని కాబట్టి తానూ హాజరైనట్లు స్పష్టీకరణ

కొన్నిరోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భేటీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి భేటీలో తన పాత్ర ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అమిత్ షా అపాయింటుమెంట్ కోసం లోకేశ్ పదేపదే అడిగారన్నారు. ఢిల్లీలో ఉన్న పదిరోజుల్లో ఆయన పలుమార్లు అమిత్ షాతో అపాయింటుమెంట్ కోసం విజ్ఞప్తి చేశారన్నారు.

అమిత్ షా తన బిజీ షెడ్యూల్ కారణంగా తొలుత లోకేశ్‌ను కలవలేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక కేంద్రమంత్రిని తానే అని, దీంతో ఆ సమావేశానికి తానూ హాజరయ్యానని చెప్పారు. కాగా, తనకు కిషన్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని, అమిత్ షా తనను కలుస్తానని చెప్పినట్లు ఆయన ఫోన్ చేసి చెప్పారని నారా లోకేశ్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News