Off duty pilot: విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లు బంద్ చేసేందుకు పైలట్ యత్నం!

Off duty pilot of Alaska Airlines tries to shut down engines mid air arrested

  • అలాస్కా ఎయిర్‌లైన్స్‌లో ఆదివారం షాకింగ్ ఘటన 
  • కాక్‌పిట్‌లో ప్రయాణిస్తున్న ఆఫ్-డ్యూటీ పైలట్ ఇంజిన్లను ఆపేందుకు ప్రయత్నం
  • కెప్టెన్, కోపైలట్ అతడిని అడ్డుకున్న వైనం
  • విమానాన్ని పోర్ట్‌లాండ్‌లో అత్యవసరంగా దించివేత, నిందితుడి అరెస్టు

విమానం గాల్లో ఉండగా ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించిన ఓ ఆఫ్-డ్యూటీ‌ పైలట్‌ను అమెరికా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. వాషింగ్టన్ డీసీ నుంచి శాన్‌ఫ్రాన్‌సిస్కో వెళుతున్న అలాస్కా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికి డ్యూటీలో లేని జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ అనే పైలట్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. విమానం కాక్‌పిట్‌‌లోని జంప్ సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న అతడు అకస్మాత్తుగా ముందుకు ఉరికి విమానం ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో, విమానం కెప్టెన్, కోపైలట్ అప్రమత్తమై అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం, ఇతర సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ క్రమంలో విమానాన్ని అత్యవసరంగా పోర్ట్‌లాండ్‌లో దింపి నిందితుడిని అరెస్టు చేశారు. విమానంలోని మొత్తం 83 ప్రయాణికులపై హత్యాయత్నానికి పాల్పడినందుకు నిందితుడిపై కేసు నమోదైంది. నిబంధనల ప్రకారం, డ్యూటీలో లేని పైలట్లు విమానం కాక్‌పిట్‌లోని జంప్ సీటులో కూర్చుని ప్రయాణించేందుకు అనుమతి ఉంది. అయితే, విమాన పైలట్ అనుమతిచ్చాకే ఆఫ్ డ్యూటీ పైలట్లను కాక్‌పిట్‌లోకి రానిస్తారు.

  • Loading...

More Telugu News