Sachin Tendulkar: సచిన్ సంచలన ట్వీట్.. అసలు ఆఫ్ఘనిస్థాన్ కు, అజయ్ జడేజాకు మధ్య సంబంధం ఏమిటి?
- వరల్డ్ కప్ లో చెలరేగిపోతున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు
- బలమైన ఇంగ్లండ్, పాకిస్థాన్ లను చిత్తు చేసిన వైనం
- ఆఫ్ఘన్ జట్టుపై అజయ్ జడేజా ప్రేరణ ఉందన్న సచిన్
ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు సంచలనాలను నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఇంగ్లండ్ తో, నిన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లతో సమానంగా అత్యద్భుతంగా ఆడింది. నిన్నటి మ్యాచ్ లో పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టించి, ఆ జట్టును చిత్తు చేసింది. మరోవైపు ఆప్ఘన్ జట్టు ఈ రేంజ్ లో ఆడటం వెనుక టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ అజయ్ జడేజా ప్రభావం ఉండొచ్చని సచిన్ టెండూల్కర్ అన్నారు.
ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ప్రదర్శన ఔట్ స్టాండింగ్ గా ఉందని సచిన్ కొనియాడారు. బ్యాటింగ్ లో డిసిప్లిన్, వాళ్లు చూపించిన తెగువ, వికెట్ల మధ్య పరుగులు పెట్టిన విధానం... వాళ్ల హార్డ్ వర్క్ ను సూచిస్తున్నాయని చెప్పారు. ఇది కచ్చితంగా అజయ్ జడేజా ప్రేరణ వల్లే అయి ఉంటుందని అన్నారు. బలమైన బౌలింగ్ లైనప్ తో ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి జట్లను చిత్తు చేయడం... సరికొత్త ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆవిర్భావాన్ని సూచిస్తోందని చెప్పారు. ఈ ఆవిర్భావాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం గమనిస్తోందని అన్నారు. వెల్ డన్ ఆఫ్ఘనిస్థాన్ అని కొనియాడారు.
ఇక ఆఫ్ఘనిస్థాన్ కు, అజయ్ జడేజాకు మధ్య సంబంధం ఏమిటనే సందేహం చాలా మందికి కలగవచ్చు. 2023 ప్రపంచ కప్ కు గాను అజయ్ జడేజాను అసిస్టెంట్ కోచ్ గా ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్టు నియమించుకుంది. ఈ క్రమంలో జడేజా కీలక సూచనలు, మార్గదర్శకాలు ఆ జట్టును మరింత బలోపేతం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జడేజా కోచింగ్ లో ఆ జట్టు ఊహించని విధంగా రాటుతేలింది.