medigadda barriage: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన అంశంపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Police case filed on medigadda barriage issue

  • అక్టోబర్ 21న భారీ శబ్దంతో కుంగిపోయిన పిల్లర్
  • శబ్ధం రావడంతో కుట్రకోణం ఉందని అధికారుల అనుమానం
  • మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులు

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన అంశంపై మహదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 21వ తేదీన రాత్రి పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఫిర్యాదు చేశారు. మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కుట్రకోణం ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల ఫిర్యాదు నేపథ్యంలో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం వచ్చిందని ఫిర్యాదు రావడంతో ఆ కోణంపై పోలీసులు దృష్టి సారించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ కుంగిన అంశంలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేయనున్నారు.

  • Loading...

More Telugu News