Gangula Kamalakar: సమైక్య పాలనలో తెలంగాణను దోచుకున్నారు: మంత్రి గంగుల కమలాకర్
- ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అభివృద్ధి శూన్యం అన్న గంగుల
- కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూసేవారని విమర్శ
- కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని వ్యాఖ్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఏ మాత్రం అభివృద్ధి లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరెంటు, నీళ్లు లేక ప్రజలు, రైతులు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పారు. కరెంటు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారని... కరవు కారణంగా చాలా మంది రైతులు పొట్టకూటి కోసం దుబాయ్ కి వలసపోయారని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ సంపదను దోచుకుపోయారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో కరెంట్ కోతలే లేవని చెప్పారు. బొమ్మనకల్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.