Harish Rao: కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి రోజూ మాట్లాడుకుంటున్నారు: హరీశ్ రావు

Harish Rao comments on bjp and congress

  • కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సరెండర్ అయిందన్న మంత్రి హరీశ్ రావు
  • మరికొంతమంది బీజేపీ నేతల్ని కాంగ్రెస్‌లోకి కిషన్ రెడ్డి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ 
  • కోమటిరెడ్డి రాజీనామాతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలైందని వ్యాఖ్య  

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం మళ్లీ బట్టబయలైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సదాశివపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోమటిరెడ్డి సోదరులు చెరో పార్టీలో ఉంటూ అన్న బీజేపీకి, తమ్ముడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా ఆ పార్టీలు చర్యలు తీసుకోలేదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణ బిడ్డను ఓడించాలని చూశాయన్నారు. ఆ రెండు పార్టీలకు సిద్ధాంతం లేదని, కాబట్టి ప్రజలు వారిని నమ్మరన్నారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోజూ మాట్లాడుకొని పని చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి మరికొంతమంది నేతలను కాంగ్రెస్ పార్టీలోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ స‌రెండ‌ర్ అయింద‌ని, దీంతో కాషాయానికి, కాంగ్రెస్‌కు మ‌ధ్య ఉన్న బంధం బ‌ట్ట‌బ‌య‌లు అయింద‌న్నారు. కేసీఆర్‌ను త‌ట్టుకోలేక‌, బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర‌లు ప‌న్నుతున్నాయ‌న్నారు.

  • Loading...

More Telugu News