Mohammed Shami: షమీకి ఒక్క మ్యాచ్ ముచ్చటేనా.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమా?
- కివీస్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసుకున్న షమీ
- ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం
- పాండ్యా కూడా మరో మూడు మ్యాచ్‌లకు దూరం!
టీమిండియా అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. చూస్తుంటే పేసర్ మహ్మద్ షమీది ఒక్క మ్యాచ్ ముచ్చటలానే కనిపిస్తోంది. ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడిన షమీ సంచలన స్పెల్‌తో కివీస్‌ను కట్టడి చేశాడు. ఐదు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ దెబ్బతో షమీ స్థానం ఖాయమని అభిమానులు భావించారు. అయితే, లక్నోలో 29న ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో షమీ బెంచ్‌కే పరిమితం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. లక్నో పిచ్ స్లో బౌలర్లకు అనుకూలిస్తుందని, కాబట్టి షమీని పక్కనపెట్టి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మరోవైపు, చీలమండ గాయంతో బాధపడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో 29న ఇంగ్లండ్, నవంబర్ 2న జరగనున్న శ్రీలంక మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడం లేదు. అంతేకాదు, నవంబరు 5న కోల్‌కతాలో సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం అనుమానంగానే ఉంది.