ndia Middle East Europe Economic Corridor: హమాస్ పరోక్ష లక్ష్యం భారత్ ప్రాజెక్టును దెబ్బకొట్టడమేనా?
- ఇదే కారణమై ఉండొచ్చన్న అమెరికా అధ్యక్షుడు
- ఎలాంటి కవ్వింపులు లేకుండా రెచ్చిపోయిన హమాస్ మిలిటెంట్లు
- ఏకపక్షంగా ఇజ్రాయెల్ పై ముప్పేట దాడులు
- భారత్-మిడిల్ ఈస్ట్, యూరప్ ప్రాజెక్టుకు వ్యతిరేకమన్న సందేహం
ఎలాంటి కవ్వింపులు లేవు. ఇజ్రాయెల్ దాడులు చేసింది లేదు. మరి పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఎందుకని మూకుమ్మడిగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డారు? అది కూడా ఎన్నడూ లేని విధంగా వేలాది క్షిపణులతో, భూమి, సముద్ర మార్గాల ద్వారా ఇజ్రాయెల్ లోకి చొరబడి కనిపించిన వారిని అంతమొందించడం వంటి క్రూరమైన దాడికి హమాస్ దిగడం, ఇజ్రాయెల్ తోపాటు. ప్రపంచదేశాలు నివ్వెరపోయేలా చేసింది. నిజానికి పాలస్తీనా ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రత్యేక దేశంగా లేదు. వారికంటూ సరిహద్దులతో కూడిన ప్రత్యేక దేశం డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ, ఇప్పుడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడికి దిగడం వెనుక ఆంతర్యం ఏంటి..?