Varun Tej: వెడ్డింగ్ బెల్స్.. ఇటలీకి పయనమైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

Varun Tej and Lavanya Tripathi leaves to Italy for marriage
  • నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి
  • ఇటలీలోని టస్కనీలో వివాహ వేడుక
  • ఈ ఉదయం ఇటలీకి బయల్దేరిన ప్రేమ జంట
టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరి పెళ్లి జరగనుంది. ఇటలీలోని టస్కనీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. పెళ్లికి ముందు అక్టోబర్ 30న మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నాయి. పెళ్లి కోసం ఈ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వరుణ్, లావణ్యలు ఇటలీకి బయల్దేరారు. వీరితో పాటు వైష్ణవ్ తేజ్ కూడా వెళ్లాడు. మరోవైపు నవంబర్ 5న మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Varun Tej
Lavanya Tripathi
Tollywood
Marriage
Italy

More Telugu News