KTR: రైతన్నా... ఈ రెండింట్లో ఏది కావాలో ఆలోచించు: మంత్రి కేటీఆర్ ట్వీట్

Minister KTR tweet to farmers

  • తెలంగాణలో కేసీఆర్, కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తోన్న పథకాలను బేరీజు వేసుకోవాలని సూచన
  • కేసీఆర్ ఇస్తోన్న 24 గంటల విద్యుత్ కావాలా? కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తోన్న 5 గంటల విద్యుత్ కావాలా? అని ప్రశ్న
  • అరవై ఏళ్లు ఆగం చేసినవారు కావాలా? నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాలా? అని కేటీఆర్ ట్వీట్

నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోన్న, అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను బేరీజు వేసుకోవాలని కోరారు. ఈ రెండింట్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. తెలంగాణ, కర్ణాటక పరిస్థితులను పరిశీలించాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న 24 గంటల విద్యుత్ కావాలా? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోన్న 5 గంటల విద్యుత్ తీసుకుంటారా? లేక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన మూడు గంటల విద్యుత్ కావాలా? రైతుబంధు, రైతుబీమా ఇచ్చి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ కావాలా? అరవై ఏళ్లు ఆగం చేసిన వారు మీకు కావాలా? నెర్రలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాలా? ఏది కావాలి మనకు? ఆలోచించు రైతన్నా.... అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News