Telugudesam: కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్‌పై దాడిని ఖండించిన నారా లోకేశ్
- కావలిలో బస్సు డ్రైవర్‌పై దాడిని ఖండించిన యువనేత
- హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారని ఆరోపణ
- ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
అవినీతి దందాలకు అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్‌పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ సైకో జగన్ ఫ్యాక్షన్ ప్రదేశ్‌గా మారిపోయిందని మండిపడ్డారు. సైకో జగన్ పోతేనే ఇలాంటి పిల్ల సైకో గ్యాంగులన్నీ పోతాయని ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని లోకేశ్ మండిపడ్డారు.
వైసీపీ అధినేత తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ని వేసేస్తే.. ఆయన సైకో ఫ్యాన్స్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారని వ్యాఖ్యానించారు. కావలిలో రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్ తీయాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ కొట్టడమే నేరమైందని పేర్కొన్నారు. నడిరోడ్డుపై పట్టపగలు వైకాపా నేతలు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. కొందరు వ్యక్తులు బస్సు డ్రైవర్‌పై దాడి చేస్తుండడం ఈ వీడియోలో కనిపించింది.