Telangana: మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై పూర్తి వివరాలు ఇవ్వండి.. రాష్ట్రానికి కేంద్రం లేఖ
- ఆదివారం లోగా వివరాలు ఇవ్వాలని డెడ్లైన్
- కేంద్ర బృందం ఢిల్లీ బయలుదేరకముందే అందించాలని సూచన
- తెలంగాణ ప్రభుత్వానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనపై తాము కోరిన పూర్తి సమాచారాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఆదివారంలోగా వివరాలు అందివ్వాలంటూ జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ లేఖ రాసింది. అక్టోబర్ 23-26 మధ్య ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర కమిటీ తిగిగి ఢిల్లీ బయలుదేరకముందే వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే కొన్ని వివరాలు అందించగా మరికొన్ని వివరాలు కావాలని కేంద్రం నియమించిన కమిటీ సభ్యులు కోరుతున్నారు.
మొత్తం 20 అంశాలకు సంబంధించిన సమాచారం అడగగా 3 అంశాలకు సంబంధించిన డేటాను మాత్రమే ఇచ్చారని డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. ఒక అంశంపై పూర్తి సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన ఇటీవలే కుంగిన విషయం తెలిసిందే. భారీ శబ్దంతో కుంగింది. ఆ వెంటనే డ్యామ్ పరిశీలనకు కేంద్రం కమిటీని నియమించింది.