Mukesh Ambani: ముఖేష్ అంబానీకి బెదిరింపు ఈ-మెయిల్.. ఈసారి ఎంత డబ్బు డిమాండ్ చేశారంటే?

Death threat to Mukesh Ambani for rs 200 Crores demand

  • రూ.200 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరిక
  • ఒకే మెయిల్ అకౌంట్ నుంచి రెండుసార్లు బెదిరింపు
  • తొలి మెయిల్‌కు స్పందించకపోవడంతో డబ్బు పెంచిన దుండగులు

భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. రూ.200 కోట్లు ఇవ్వకుంటే కాల్చి చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరించారు. నిందితులు రూ.20 కోట్లు ఇవ్వాలని తొలుత డిమాండ్ చేశారు. అయితే దానిపై ఎలాంటి స్పందనా లేకపోవడంతో తాజా ఈ-మెయిల్‌లో డబ్బును రూ.200 కోట్లకు పెంచారని పోలీసులు వివరించారు.

ఒకే ఈ-మెయిల్ అకౌంట్ నుంచి ఈ 2 మెయిల్స్ వచ్చాయని పోలీసులు వివరించారు. ‘‘ మా ఈ-మెయిల్‌కు మీరు స్పందించలేదు. ఇప్పుడు మొత్తం రూ.200 కోట్లు ఇవ్వాలి. లేదంటే మీ డెత్ వారెంట్‌పై సంతకం చేస్తాం’’ అని పేర్కొన్నారని తెలిపారు. కాగా రూ.20 కోట్లు చెల్లించకుంటే కాల్చి చంపుతామని బెదిరిస్తూ శుక్రవారం ముఖేష్ అంబానీకి తొలి బెదిరింపు మెయిల్ వచ్చింది. భారత్‌లోనే అత్యుత్తమ షూటర్లు తమవద్ద ఉన్నారని ఈ హెచ్చరికలో దుండగులు పేర్కొన్నారు. ముఖేష్ అంబానీ భద్రతా ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా దక్షిణ ముంబైలోని గామ్‌దేవి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 387, 506 (2) కింద కింది గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News