RTC Driver: ఆర్డీసీ డ్రైవర్ పై దాడి చేసిన నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చిన పోలీసులు

Police introduces accused of attack on RTC Driver before media

  • కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి
  • రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు
  • ఏడుగురిని అరెస్ట్ చేశామన్న నెల్లూరు జిల్లా ఎస్పీ
  • ప్రధాన నిందితుడి కోసం గాలింపు జరుగుతోందని వెల్లడి

నెల్లూరు జిల్లా కావలి వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

ఇవాళ నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ సహా మరో ముగ్గురి కోసం గాలింపు జరుగుతున్నట్టు ఎస్పీ వెల్లడించారు. 

ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి పాల్పడిన వారంతా నకిలీ నోట్ల మార్పిడి ముఠాకు చెందినవారని తెలిపారు. మోసాలకు పాల్పడడం, ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తుంటారని వివరించారు. ఈ ముఠా సభ్యులకు గతంలో నేరచరిత్ర ఉందని, వారిపై కొన్ని కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News