Tamilisai Soundararajan: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిపై దాడిపై స్పందించిన గవర్నర్ తమిళిసై.. డీజీపీకి ఆదేశాలు

Governor Tamilisai responds on attack on MP Kotha Prabhakar Reddy
  • కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అంశం దిగ్భ్రాంతికి గురి చేసిందన్న తమిళిసై
  • ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న గవర్నర్  
  • అభ్యర్థులు ప్రచారం చేసే సమయంలో భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచన
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేసిన అంశంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ దాడి ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీకి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారం చేసే వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం శాంతియుత వాతావరణాన్ని ఉండేలా చూడటం అవసరమన్నారు.
Tamilisai Soundararajan
kotha prabhakar reddy
BRS
dubbaka
Telangana Assembly Election

More Telugu News