Ram Gopal Varma: ఓ మాజీ సీఎం జైల్లో ఉంటే సంగీత కచేరీ నిర్వహించడం ఇదే మొదటిసారి: వర్మ

Ram Gopal Varma opines on CBN Gratitude Concert

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్
  • సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైదరాబాద్ సైబర్ టవర్స్
  • బాలయోగి స్టేడియంలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్
  • పాటలతో ఉర్రూతలూగించిన అనూప్ రూబెన్స్ బృందం

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో గత 52 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. ఆయన అరెస్ట్ ను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సంఘీభావ ప్రదర్శనలు చేపట్టడం తెలిసిందే. ముఖ్యంగా, ఐటీ నిపుణులు అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. 

హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిన్న బాలయోగి స్టేడియంలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ నిర్వహించారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తన బృందంతో ఉర్రూతలూగించారు. 

దీనిపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. "సెలబ్రిటీ కార్యక్రమాలు ఏదైనా విషాద ఘటన కారణంగానో, నిరసనల కారణంగానో రద్దవడం చాలాసార్లు విన్నాను. కానీ, ఓ మాజీ ముఖ్యమంత్రి జైల్లో ఉంటే సంగీత కచేరీ నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా. అది చంద్రబాబు విషయంలో జరిగింది" అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News