Stock Market: వరుసగా రెండో రోజు నష్టపోయిన మార్కెట్లు
- 283 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2 శానికి పైగా నష్టపోయిన ఏసియన్ పెయింట్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 283 పాయింట్లు నష్టపోయి 63,591కి చేరుకుంది. నిఫ్టీ 90 పాయింట్లు కోల్పోయి 18,989కి దిగజారింది. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, ఎఫ్ఐఐల అమ్మకాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.67%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.47%), రిలయన్స్ (0.35%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.15%), భారతి ఎయిర్ టెల్ (0.02%),
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.04%), టాటా స్టీల్ (-1.81%), నెస్లే ఇండియా (-1.64%), మారుతి (-1.61%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.54%).