Chiranjeevi: వరుణ్-లావణ్య వివాహం.. క్లీంకారతో చిరంజీవి దంపతుల ఫొటో వైరల్

Photo of chiranjeevi surekha with grand daughter klinkara goes viral
  • ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి వరుణ్, లావణ్యల వివాహం
  • పెళ్లిలో చిరు, అల్లు కుటుంబాల సందడి
  • మనవరాలు క్లీంకారను మురిపెంగా చూస్తున్న చిరంజీవి దంపతుల ఫొటో వైరల్
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. క్రీమ్ గోల్డ్ షెర్వాణీలో వరుణ్ తేజ్, కాంచీపురం చీరలో లావణ్య త్రిపాఠి జంట మెరిసిపోయింది. ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, హీరో నితిన్ హాజరుకాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 

అయితే, మనవరాలు క్లీంకారతో చిరంజీవి దంపతులు దిగిన ఫొటో ప్రస్తుతం మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో చిరంజీవి అర్ధాంగి సురేఖ క్లీంకారను ఎత్తుకోగా చిరంజీవి మురిపెంగా చిన్నారివైపు చూస్తున్న వైనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. నెటిజన్లు ఈ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు.  

ఇక కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్యలకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరి రిసెప్షన్ ఈ నెల 5న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తారు.
Chiranjeevi
Varun Tej
Lavanya tripathi

More Telugu News