Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. తొలిసారి స్పందించిన రోహిత్‌శర్మ

Rohit Sharma 1st Big Official Update On Hardik Pandya Return

  • గాయం కారణంగా లీగ్ జట్టుకు దూరమైన పాండ్యా
  • వేగంగా కోలుకుంటున్నాడన్న రోహిత్‌శర్మ
  • నేటి మ్యాచ్‌కు కూడా దూరం
  • చివరి లీగ్ మ్యాచ్‌కూ డౌటే
  • నేరుగా సెమీస్ ఆడే అవకాశం

గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై కెప్టెన్ రోహిత్‌శర్మ అప్‌డేట్ ఇచ్చాడు. అక్టోబరు 19న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన పాండ్యా న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నేడు శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. నేటి మ్యాచ్‌లోనూ పాండ్యా ఆడడం లేదని చెబుతూనే ఓ గుడ్‌న్యూస్ కూడా చెప్పాడు. 

గాయం నుంచి పాండ్యా వేగంగా కోలుకుంటున్నాడని అయితే, తర్వాతి మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నాడు. అతడికి అయిన గాయాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని, ప్రస్తుతం పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయని తెలిపాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రతి మూడు నాలుగు రోజులకు ఒక మ్యాచ్ ఉండడంతో బ్యాటింగ్, బౌలింగ్ భారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుందన్నాడు. హార్దిక్ విషయంలో ఫలితాలు పాజిటివ్‌గానే ఉన్నాయని, త్వరలోనే అతడిని చూస్తామని చెప్పుకొచ్చాడు.

చీలమండ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న పాండ్యా నెదర్లాండ్స్‌తో ఈ నెల 12న బెంగళూరులో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువగానే ఉంది. పాండ్యా చివరి లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువేనని, నేరుగా సెమీస్ ఆడే చాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు కూడా తెలిపాయి. ప్రపంచకప్‌లో ఆరు వరుస విజయాలతో ఊపుమీదున్న భారత జట్టు 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేడు శ్రీలంకపైనా విజయం సాధిస్తే తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా సెమీస్‌లో బెర్త్ ఖాయం చేసుకుంటుంది.

  • Loading...

More Telugu News