YSR Lifetime Achievement awards: వేడుకగా వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం
- బుధవారం విజయవాడలో వైభవంగా జరిగిన కార్యక్రమం
- ముఖ్య అతిథిగా గవర్నర్ జస్టిస్ నజీర్, విశిష్ట అతిథిగా వైఎస్ విజయమ్మ, సీఎం జగన్ హాజరు
- మొత్తం 27 మంది ప్రముఖులకు అవార్డుల ప్రదానం
- తన చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడంపై గవర్నర్ హర్షం
- అవార్డు గ్రహీతలు తెలుగు ప్రజల సంపద అని సీఎం జగన్ వ్యాఖ్య
వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డులు-2023 ప్రదానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విజయవాడలో వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విశిష్ట అతిథిగా వైఎస్ విజయమ్మ, సీఎం జగన్ పాల్గొన్నారు. వ్యవసాయం, కళలు- సంస్కృతి, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సామాజిక సేవ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 27 మంది ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ ఈ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 23 మందిని జీవితసాఫల్యం పురస్కారం వరించగా నలుగురికి అచీవ్‌మెంట్ అవార్డులు లభించాయి. భారత మాజీ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి.. జగన్, గవర్నర్ చేతుల మీదుగా లైఫ్‌టైం అచీవ్‌మెంట్ పురస్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ తన చేతుల మీదుగా అవార్డులు అందించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. వైఎస్సార్ తన సంక్షేమ పథకాల ద్వారా తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. ఈ అవార్డులు అందుకున్న వారందరూ తమ తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల వారసత్వాన్ని తమ భుజాలపై మోస్తున్నారని కితాబిచ్చారు. పురస్కార గ్రహీతలు తెలుగు ప్రజల సంపద అని వ్యాఖ్యానించారు.