IIT BHU: ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థినికి ఆకతాయిల వేధింపులు

IIT BHU student stripped molested by bike borne men protests on campus
  • గురువారం తెల్లవారుజామున యువతిని వేధించిన ముగ్గురు ఆగంతుకులు
  • ఓ మూలకు తీసుకెళ్లి దుస్తులు తొలగించి వీడియో రికార్డింగ్
  • బాధితురాలి ఫోన్ నెంబర్ కూడా తీసుకుని విడిచిపెట్టిన వైనం
  • యువతి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు
  • ఘటనపై భగ్గుమన్న విద్యార్థులు, క్యాంపస్‌లో ధర్నా
వారణాసిలో ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థిని ఆకతాయిల చేతిలో లైంగిక వేధింపులకు గురికావడం కలకలం రేపుతోంది. గురువారం తెల్లవారు జామున ఆమెపై ముగ్గురు యువకులు వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఆమె తన స్నేహితుడితో కలిసి హాస్టల్ నుంచి బయలుదేరగా కర్మన్ బాబా టెంపుల్ వద్ద బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించారు. యువతిని ఆమె ఫ్రెండ్ నుంచి దూరంగా ఓ మూలకు తీసుకెళ్లి దుస్తులు తొలగించి వీడియో రికార్డు చేశారు. బలవంతంగా ఆమెను చుంబించి ఫొటోలు కూడా తీసుకున్నారు. ఆ తరువాత ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకుని 15 నిమిషాల తరువాత విడిచిపెట్టారు. 

కాగా, యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆగంతుకులపై సెక్షన్ 354తో పాటూ ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, యువతికి వేధింపుల ఘటన గురించి తెలియడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. క్యాంపస్‌లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వద్ద వారు ధర్నాకు దిగారు. ఇది బయటవ్యక్తుల పనేనని, వారిని క్యాంపస్ లోపలికి రాకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఘటనపై స్పందించిన డీసీపీ ఆర్ ఎస్ గౌతమ్ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీసీటీవీలు నిరంతరం పనిచేసేలా, విద్యుత్ అంతరాయాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు మెమొరాండం ఇచ్చినట్టు పేర్కొన్నారు. నిందితుల ఆచూకీ కనుక్కునేందుకు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశిలిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
IIT BHU
Varanasi
Crime News

More Telugu News