Hardik Pandya: ప్రపంచకప్‌కు దూరం కావడంపై ఆవేదనగా స్పందించిన హార్దిక్ పాండ్యా
- బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన పాండ్యా
- జట్టుకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్న ఆల్‌రౌండర్
- అయినా జట్టుతోనే ఉంటానన్న పాండ్యా
చీలమండ గాయంతో అనూహ్యంగా ప్రపంచకప్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆవేదనతో స్పందించాడు. ప్రపంచకప్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నాడు. అయినప్పటికీ తాను జట్టుతోనే ఉంటానని, ప్రతి బంతికీ జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు. అభిమానుల ప్రేమ, ఆప్యాయతలు, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ జట్టు చాలా ప్రత్యేకమైనదని, ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తామని చెప్పుకొచ్చాడు.
పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ పాండ్యా గాయపడ్డాడు. ఎడమ చీలమండకు గాయం కావడంతో ఆ ఓవర్ ముగించకుండానే మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగలేదు. తాజాగా, అతడి గాయంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడం లేదని పేర్కొంది. కాగా, పాండ్యా స్థానంలో యువ పేసర్ ప్రసీద్ కృష్ణకు చోటు లభించింది.