Bhanuprakash Reddy: డేట్, టైమ్ చెప్పండి... నేను రెడీ: టీటీడీ ఈవోకు భానుప్రకాశ్ రెడ్డి సవాల్
- పాత మంటపాలను తొలగిస్తున్న టీటీడీ
- ఇటీవలే పార్వేటి మంటపం పునర్నిర్మాణం
- నిర్మాణంపై బీజేపీ తీవ్ర విమర్శలు
తిరుమల, తిరుపతిలోని పాత మంటపాలను టీటీడీ యాజమాన్యం తొలగిస్తుండటంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బీజేపీ టీటీడీ తీరును తప్పుపడుతోంది. తిరుమల కొండపై ఉన్న పార్వేటి మంటపాన్ని తొలగించిన టీటీడీ... అక్కడ మరో మంటపాన్ని నిర్మించింది. ఈ నిర్మాణం సరిగా లేదంటూ బీజేపీ ఫైర్ అవుతోంది.
ఈ నేపథ్యంలో... టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ... ధైర్యం ఉంటే పార్వేటి మంటపం వద్దకు వచ్చి నిర్మాణం బాగోలేదని చెప్పగలరా? అని సవాల్ విసిరారు. ఈ సవాల్ పై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. టీటీడీ ఈవో సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. డేట్, టైమ్ చెపితే పురావస్తు శాఖ అధికారులతో కలిసి వస్తానని అన్నారు. మరమ్మతుల పేరుతో ప్రాచీన కట్టడాలని కూల్చేస్తారా? అని మండిపడ్డారు. మంటపాలను జీర్ణోద్ధరణ చేసేటప్పుడు పురావస్తు శాఖ అధికారులను సంప్రదించాలని చెప్పారు. ఆర్కియాలజీ అధికారుల సూచన మేరకే పనులు చేపట్టాలని అన్నారు.