Anand Mahindra: అద్దంలో తనను తాను చూసుకుని కంగారుపడిన ఎలుగుబంటి.. అచ్చం తన రియాక్షన్ కూడా అలాగే ఉంటుందన్న ఆనంద్ మహీంద్రా.. వీడియో ఇదిగో!

My reaction to my reflection every time I get up too early on a sunday morning says Anand Mahindra
  • నవ్వు తెప్పించే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • ఆదివారం పెందరాలే లేస్తే తన రియాక్షన్ కూడా అదేనన్న మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్
  • రకరకాల కామెంట్లతో నవ్వు తెప్పిస్తున్న నెటిజన్లు
ఆనంద్ మహీంద్రా.. నెటిజన్లకు ఇది చిరపరితమైన పేరు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ అయిన ఆనంద్ మహీంద్రా అద్భుతమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వాటిలో కొన్ని స్ఫూర్తి నింపేవి ఉంటే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని నవ్వు తెప్పిస్తాయి. 

తాజాగా, ఈ ఉదయం నవ్వు తెప్పించే మరో వీడియోను షేర్ చేశారు. అందులో ఓ ఎలుగుబంటి అడవిలో ఓ చెట్టుకు అమర్చిన నిలువెత్తు అద్దాన్ని చూసి ఒక్కసారిగా షాకైంది. ఆ వెంటనే వెనక తనలాంటిదే ఇంకోటి ఉందేమోనని వెళ్లి చూసింది. అక్కడా కనిపించకపోవడంతో గాభరా పడింది. అద్దాన్ని పట్టుకుని చూసింది. దానిని బలంగా లాగడంతో అది కాస్తా కిందపడింది. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఆదివారాల్లో మరీ ఉదయాన్నే లేచినప్పుడు తన రియాక్షన్ కూడా ఇలానే ఉంటుందని చెబుతూ నవ్వులు పూయించారు.
Anand Mahindra
Viral Videos
Bear

More Telugu News